మానవ జన్మ ఒక "వరం" గా భావించాలి
మనిషిగా పుట్టినందుకు ఒక "వరం" గా భావించాలి.ఈ భూ ప్రపంచంలోగల జీవులన్నిటి లోకి ఉత్తమమైన జన్మ ... మానవ జన్మ . మంచి చెడుల విచక్షణా జ్ఞానం తెలిసిన జన్మ మానవ జన్మ . పూర్వ జన్మలో చేసిన పాపాలను , తప్పులను కూడా సరిదిద్దుకునే అవకాశం గల జన్మ.. మానవ జన్మ . కాబట్టి మంచిగాఆలోచించాలి, మంచిగామాట్లాడాలి, మంచి పని చెయ్యాలి. ఎందుకంటే మనం ఏమి చేస్తామో... అదే మనకు పదింతలుగా తిరిగి మనకే చేరుతుంది . మనం చేసే మంచి వలన పూర్వ జన్మలో చేసిన పాపాలను కూడా ప్రక్షాళన చేస్తుంది. మన పితృదేవతలకు కూడా తరింప జేస్తుంది. ఏం చేయాలన్నా వయసులొ ఉన్నప్పుడే చెయ్యాలి. వయసు మీరిన తరువాత ఏమీ చేయలేము . పాతికేళ్ల వయసులో ఉండే అందం , ఓపిక .. అరవై ఏళ్లకు ఉండదు., అరవై ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన పాతికేళ్లకు ఉండదు. బతకడానికి డబ్బు ఎంత అవసరమో .. "మన," అని అనుకోడానికి బంధాలు కూడా అంతే అవసరం. మోయ లేనంత డబ్బు సంపాదించినా పోయినప్పుడు మోయడానికి నలుగురు మనుషులను సంపాదించుకోకపోతే ఆ జీవితం వ్యర్థం. మనిషికి ఎంత డబ్బు, ఆస్తులు అంతస్తులు .. ఉన్నా.. మనసుకు ప్రశాంతత లేకపోతే అంతా శూన్యం. ప్రపంచం లో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉండగలరు. తిన్న ఆహారం జీర్ణం చేసుకొనేవారు , పడుకున్నవెంటనే నిద్రలోకి జారుకొనేవారు . అలాజరగాలి అంటే మనిషికి సంతృప్తి... మనసుకిశాంతి కలిగిఉండాలి. మౌనంగా ఉన్న ప్రతివారూ మనశ్శాంతి గా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకో లేనంత బాధలు ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు . వారి ఆత్మీయులకు మాత్రమే అది అర్థం అవుతుంది . వారి తోడు.. ధైర్యం..సలహాలవలన కొంతవరకూ ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది . మన మంచి ఆలోచనలే మనకు బాధలనుండి విముక్తి చేయ గలవు. బాధలు అనేవి ఎప్పుడూ ఉండిపోవు., సంతోషం అనేది రాకమానదు. అన్నింటినీ ఓర్పుతో భరించి ... కొన్నింటిని నేర్పుతో దాటి వెళ్ళడమే జీవితం . భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము.. తెగించడం తెలియకపోతే... బాధలనుండి బైట పడలేము. ఇదే జీవిత సత్యం. సర్వే జనా సుఖినోభవంతు.