డంబాలు పలికే డబ్బారాయుడు ! - Dabbalu Palikey Dabbarayudu - Telugu moral stories

ఒక అతను రకరకాల ప్రదేశాలు సందర్శిస్తూ, కనపడిన వారికి తన గురించి తెగ గొప్పలు చెప్పుకుంటుంన్నాడు. ఓహ్! ఆ దేశం లో నేను ఇలా చేశా, అలా చేసా, నా విన్యాసాలు చూసి అందరూ డంగై పోయారు, వాళ్లకి నోటమాట రాలేదు. చాలాసేపు విస్మయం చెంది, ఆ తరువాత నన్ను తెగ మెచ్చుకున్నారు. నీలాగా ఇంకెవ్వరూ ఇలా చెయ్యలేరని తెగ మెచ్చుకున్నారని, ఒకటే డంబాలు, గొప్పలు, కోతలు కోస్తున్నాడు.

తను చెప్పే గొప్పలు వీళ్ళు నమ్మటల్లేదేమో అని అనుమానం వచ్చి, “కావాలంటే మెచ్చుకున్నసాక్షులు కూడా ఉన్నారు తెలుసా?” అన్నాడు.

అందులో ఒకడు , “సాక్షులు ఎందుకు గాని, నువ్వే మాముందు చేసి చూపిస్తే, సరిపోతుంది కదా?” అన్నాడు. అంతే, ఆ డంబాలు పలికేవాడు నెమ్మదిగా అక్కడినించి జారుకున్నాడు.


నీతి: సత్తా లేకుండా ఉత్తినే గొప్పలు చెప్పేవాళ్ళకి విలువ లేదు.