నాలుగు ఆవులు -  Four cows  - Telugu moral stories

ఒక ఊరిచివర పచ్చని మైదానం లో నాలుగు ఆవులు ఎంతో సఖ్యం గా , స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడూ కలిసి మెలిసి గుంపు గానే ఉండేవి కాబట్టి, పులి, సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి.

కొంతకాలానికి, ఎదో విషయంలో వాటిమధ్య దెబ్బలాట జరిగి, నాలుగు ఆవులు నాలుగు వైపులా విడి విడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లాయి.

ఇదే సరైన సమయమని, పులి, సింహం పొదల్లో దాక్కుని, ఒకొక్కదాన్ని చంపేశాయి.

నీతి: ఐకమత్యమే బలం.