చామదుంపల వేపుడు.
చామదుంపల వేపుడు ఇష్టపడని వారు తక్కువనె చెప్పాలి…కర కర చామదుంపల వేపుడు యెలా చేయాలొ చూద్దాం.
కావల్సినవి:
చామదుంపలు పావు కిలో
నూనె 5 స్పూన్లు
ఉప్పు తగినంత
కారం రెండు చెంచాలు
వెల్లుల్లి 6 పాయలు
విధానం:
చామదుంపల్ని నీటిలో బాగ కడగాలి. ఒక గిన్నెలో నీరు తీసుకుని వాటిని వుడికించుకొవాలి. కుక్కర్లో ఐతే మరీ మెత్తగ అయిపొతాయి చూసుకోవాలి. మరీ మెత్తగా ఐతె బాగోదు. మూడు నిముషాల తరువాత ఒకసారి చూస్తు వుండండి. చేత్తోనో, చెంచాతోనో నొక్కితె కొoచెం లోపలికి వెల్తే చాలు.
వాటిని వేరే నీటిలోకి వెసుకుని తొక్క వొలిచి పక్కన పెట్టుకోండి. బానలిలో నూనె వేడి చేసి కొంచెం ఉప్పు వేయండి. అది చిటపటలాడాక చామదుంపలని కొన్ని కొన్ని గా వేస్తూ నూనె పట్టేలా కలుపుతూ వేయండి. అన్ని వేసేసాక మీడియం మంట పై వెయించండి. మూత పెట్టకండి.
నాలుగు నిముషాలు వేపాక ఉప్పు, కారం, దంచిన వెల్లుల్లి వేసి బాగ కలపండి. మల్లి రెండు నిముషాలు వెయించండి. మూత పెట్టద్దు. కలుపుతూ ఉండండి. కారం బాగ పట్టి వేగాక పొయ్యి కట్టేసి వేడి వేడిగా వడ్డించండి.