చికెన్ స్టఫ్డ్ బ్రెడ్ రోల్స్:
కావలసిన పదార్థాలు :
బోన్‌లెస్ చికెన్ - 100 గ్రా. (ఉడికించి, మెత్తగా చేసుకోవాలి)
అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
పసుపు - అర టీ స్పూను
కారం - టీ స్పూను
జీలకర్ర పొడి - టీ స్పూన్
ధనియాలపొడి - అర టీ స్పూన్
గరంమసాలా - టీ స్పూన్
ఉప్పు - తగినంత
కోడిగుడ్లు - 2
బ్రెడ్ క్రంబ్స్ - కప్పు
నిమ్మరసం - 2 టీ స్పూన్లు
బంగాళదుంప - 1 (ఉడికించి, మెత్తగా చేయాలి)
తయారుచేసే పద్ధతి:
ఒక పాత్రలో ఉడికించిన బోన్‌లెస్ చికెన్, పసుపు, కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి, ఉప్పు, గరంమసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి అరగంటసేపు ఊరనివ్వాలి.
స్టౌ మీద బాణలి ఉంచి వేడ య్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి.
చికెన్ మిశ్రమం వేసి బాగా వేయించాలి.
మిశ్రమం బాగా దగ్గరపడ్డాక, బంగాళదుంప ముద్ద వేసి కలపాలి.
బ్రెడ్ అంచులను కట్ చేసి, నీటితో కొద్దిగా తడి చేయాలి.
తయారు చేసి ఉంచుకున్న మిశ్రమం బ్రెడ్ మీద ఉంచి రోల్ చేయాలి.
ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి గిలక్కొట్టి ఒక ప్లేట్లో పోయాలి.
మరో ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్ వేయాలి.
బ్రెడ్ రోల్స్‌ని ముందుగా కోడిగుడ్డు సొనలో దొర్లించి ఆ తరువాత బ్రెడ్‌క్రంబ్స్ పొడిలో దొర్లించాలి.
స్టౌ మీదపాన్ ఉంచి అందులో నూనె పోసి కాగాక, వీటిని ఒక్కటొక్కటిగా వేస్తూ చిన్నమంట మీద వేయించాలి.
బాగా వేగాక తీసి, సాస్‌తో కాని, చట్నీతో కాని సర్వ్ చేయాలి.