గోంగూర మటన్ మాంసం:
కావలసిన వస్తువులు :
మటన్ - అరకిలో
పసుపు - తగినంత
ఉప్పు -తగినంత
వెల్లుల్లిరేకలు - పది
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు - ఆరు
కారం - రెండు టీ స్పూన్లు
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
లవంగాలు - నాలుగు
యాలకులు - నాలుగు
బిర్యాని ఆకులు - రెండు
ద్రాక్షం చెక్క - ఒకటి(పెద్దది)
గోంగూర ఆకు - 200 గ్రాములు
ఉల్లిపాయ - ఒకటి(పెద్దది)
కరివేపాకు - ఒక రెబ్బ
కొత్తిమీర - ఒక కట్ట.
తయారు చేసే విధానం :
మాంసాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా అల్లంవెల్లుల్లి ముద్ద, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చాక దించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి వెడెక్కాక లంగాలు, యాలకులు, బిర్యాని ఆకులు, ద్రాక్షంచెక్క వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చిమిరపకాయలు, అల్లంవెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గోంగూర వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడికించిపెట్టుకున్న మాంసాన్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. దీన్ని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.