వంకాయ- పకోడ ఫ్రై:

కావలసిన పదార్థాలు:

వంకాయలు- కిలో,

నూనె- తగినంత,

పకోడీలు- పావుకిలో,

పచ్చికొబ్బరి- ఒక చిప్ప తురుము,

జీడిపప్పులు- 25 గ్రాములు,

వేరుసెనగ గింజలు- 25 గ్రాములు,

కొత్తిమీర తురుము- అరకప్పు,

పచ్చిమిర్చి- పది,

కారం- రెండు టీ స్పూన్లు,

మెంతుల పొడి- ఒక టీ స్పూను,

ఆవాలు- ఒక టీ స్పూను,

జీలకర్ర- అర టీ స్పూను,

పసుపు- అర టీ స్పూను,

ఉప్పు- తగినంత.


తయారుచేయు విధానం:

స్టౌ మీద గిన్నె పెట్టి నూనె పోసి అందులో వంకాయ ముక్కల్ని పకోడిలా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో నూనె కొంచెం ఉంచి జీడిపప్పు, వేరుశనగ గింజల్ని దోరగా వేయించి తీయాలి. మరో గిన్నెలో ఒక కప్పు నూనె పోసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి వేయించాలి. పసుపు, ఉప్పు, కారం మెంతుల పొడి వేసి బాగా కలిపి కొబ్బరి తురుము కూడ వేసి సన్నని సెగపై వేయించాలి. తరువాత వంకాయ ముక్కలు, పకోడి ముక్కలు, జీడిపప్పు, వేరుసెనగ గింజలు వేసి కలపాలి. దించే ముందు కొత్తిమీర తురుమును చల్లాలి.