List of Neethi Vakyalu in Telugu


1. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ

నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ

ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు


2. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకబడుతావ్

తర్వాత పరిగెత్తినా ప్రయోజనం ఉండదు


3. గెలుపు భారమైనా భరించు, కానీ ఓటమిని తేలికగా అంగికరించకు


4. బతకడం వేరు.. జీవించడం వేరు

బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది

జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది


5. ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే

ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు


6. నీ జీవితంలో కొందరు దీవెనల్లా వస్తారు మరికొందరు పాఠాల్లా వస్తారు


7. జీవితం పరిపూర్ణమవ్వాలంటే అందరిని సమానంగా స్వీకరించాలి


8. గమ్యాన్ని చేరటానికి రెండే మార్గాలు ఒకటి స్వశక్తి 2 పట్టుదల


9. డబ్బు అనేది మహావృక్షం లాంటిది దాని కిందకి వెళ్ళాక మన నీడ మనకు కనబడదు

ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనబడతారు డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే


10. ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం


11. ఈ పొరపాటు చేయలేదంటే కొత్తగా ఏది ప్రయత్నించటం లేదన్నమాట


12. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు


13. ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు


14. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవమే నీకు మార్గదర్శి


15. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది


16. ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు

ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు


17. అహంకారం సృష్టించే చీకటిని చేదించడం ఎవరికీ సాధ్యం కాదు


18. పైవారితో గౌరవంగా సాటివారితో స్నేహంగా మెలగడం కాదు

తనకన్నా తక్కువవారితో మెలిగేతీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది


19. అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది


20. అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి


21. దేవాలయంలో విగ్రహంలోకాక నిరుపేదలలో బలహీనులలో భగవంతుడిని దర్శించే వారంటే దేవుడికి ఇష్టం

సాటి మనిషికి సాయం చేయని వాడు భగవంతుడిని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే


22. అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది


23. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడు చేస్తూనే ఉంటారు


24. అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు, నీవు తప్పు చేస్తే ఒప్పుకో


25. కొత్త లక్ష్యాన్ని గాని కొత్త కళను గాని ఆహ్వానించడానికి వయసు మీరడంఅంటూ ఉండదు


26. మాటను మించిన మహా ఔషధం లేదు, మాటను మించిన మహా యుద్ధము లేదు


27. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు


28. నోరు జారిన మాట, చేజారిన అవకాశం, ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం దుర్లభం


29. అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.


30. మూసిన నోట్లోకి ఈగలు దూరవు, అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు


31. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది


32. అపజయం అంచుల వరకూ పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు


33. అన్నిటినీ నమ్మేవాడు నష్టపోతాడు, ఏదీ నమ్మనివాడు నష్టపోతాడు


34. అందరినీ అన్ని వేళలా సంతృప్తి పరచాలి అనుకుంటే ఓటమి తప్పదు


35. అన్నింటికి సహనమే మూలం, గుడ్డుని పొదిగిన అప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగలగొడితే కాదు


36. కష్టాలు విజ్ఞతను పెంచుతాయి. తన వారెవరో పరాయి వారెవరో తెలుపుతాయి


37. అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది


38. కనిపించేదాన్ని చూడటానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి


39. నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు


40. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు


41. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది


42. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా క్షమించగలగాలి


43. అందమైన శరీరం కొన్నాళ్లకు ఖాళీ పోవచ్చు, కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది


44. కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలమైనది


45. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది


46. ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది


47. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడుచేసుకోవడం మూర్ఖుల లక్షణం


48. ఓర్పు చేదుగా ఉంటుంది కానీ దాని ఫలితం మధురంగా ఉంటుంది


49. విజయాలే లక్ష్యాలు విలువఉన్న వ్యక్తిగా ఎదగడం ముఖ్యమే


50. ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి


51. మనుషుల్లో ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన రెండడుగులు వెనక్కి వేస్తుంది


52. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయాల్సిందే


53. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం


54. విజేత ఎన్నడూ విడిచిపెట్టడు విడిచి పెట్టేవాడు ఎన్నడూ చేయించడు


55. ఉత్సాహంతో శ్రమించడం అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించేవారి ప్రాథమిక లక్షణం


56. మనకిష్టమైన దాన్ని కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషి అయినా మనీ అయినా


57. జీవితం అనేక సంఘటనల గొలుసు, జీవించడం అనేక అనుభవాల గొలుసు


58. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం  నీ కాళ్ల కింద నుండే మొదలవుతుంది


59. ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనం అంటూ లేదు


60. తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్న వాడే ఇతరులకు దారి చూపగలడు 


61. సరైన దేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది


62. నిరంతర గమనం వలనే సూర్యుడు తేజ సంపన్నుడు అయ్యాడు

అలాగే నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేయగలవు


63. ఒక మనిషి దిగజారినా అభివృద్ధి చెందిన అది అతని స్వయంకృతమే


64. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు ఆనందంగా  జీవించడం


65. మంచి పనికి చెడ్డ రోజులు ఉండవు చెడ్డ పనికి మంచి రోజులు ఏమీ  చేయలేవు


66. ఉన్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి దాన్ని సాధించేందుకు మీ  జీవితాన్నంతా ధారపోయండి


67. మీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు, నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు


68. మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు


69. ఆనందం అంటే ఏ లోటు లేకపోవడం కాదు లోటుపాట్లు అతీతంగా మెలగగలగడం


70. సుగుణం నిన్ను రాజుని చేస్తే, మూర్ఖత్వం బానిసను చేస్తుంది


71. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడచిన కాలము మనది కాదు


72. జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాల్ని నేర్పుతుంది


73. నాయకత్వమంటే దారిపొడవునా ముందు నడవడం కాదు. బాట వెయ్యడం, త్రోవ చూపడం.


74. మెరిసే దంత బంగారం కానట్లే, మధురంగా  వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు


75. ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవమైన దిగగానే అనిపిస్తుంది


76. అడుగునున్న ఆకురాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు, రేపటి వంతు  తనదే మరి



Credits - https://www.nandasjourney.com/2020/05/neethi-vakyalu-telugu.html