బీరకాయ వంకాయ కూర:
కావలసిన వస్తువులు:
వంకాయలు - పావు కిలో.(సన్నగా పొడవుగా వుండేవి)
బీరకాయలు - పావు కిలో
ధనియాలు - 1 టీ స్పూను
మినపప్పు - 1 టీ స్పూను
శనగపప్పు - 1 టీ స్పూను
ఎండుమిర్చి - ఆరు
ఇంగువ - చిటికెడు
పసుపు - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు
కొబ్బరి తురుము - అర కప్పు. (ఎండుదయితే బాగుంటుంది)
నూనె - అర కప్పు
తయారు చేసే విధానం:
బీరకాయలు తొక్కు తీసి సన్నగా పొడవుగా కోసి పెట్టుకోవాలి. వంకాయలు కూడా అదే సైజులో కోసి నీళ్లలోనే ఉంచాలి. కళాయి స్టవ్‌మీద పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి మిరపకాయలు, మిగిలిన పోపు సామాను వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టాలి. అదే కళాయిలో మిగిలిన నూనె వేసి కాగాక వంకాయముక్కలు, బీరకాయ ముక్కలు వేసి, ఉప్పు, పసుపు వేసి కలిపి మూతపెట్టాలి. వేయించి ఉంచిన పోపు సామాను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి కూరలో వేయాలి. మధ్యలో కలుపుతుండాలి. సగం ఉడికిన తరవాత మంట తగ్గించాలి. పూర్తిగా ఉడికిన తరవాత కొబ్బరి తురుము, చింతపండు గుజ్జు వేసి బాగా కలిపి దించాలి. ఇది అన్నంలోకీ చపాతీలోకీ బాగుంటుంది.